History of lord sri rama in telugu
శ్రీ రామ నవమి విశిష్టత ఏంటి? రామ రాజ్యం ఎలా ఉండేది?
Samayam Telugu | Updated: 19 Apr 2021, 8:04 am
Subscribe
Also Read: ఈ రాశుల వారికి దుబారా ఎక్కువ.. ఖర్చు విషయంలో అస్సలు వెనక్కి తగ్గరు
పురాణాల ప్రకారం రాముడు త్రేతాయుగానికి చెందినవారు. దాదాపు 10 వేల సంవత్సరాల క్రితం ఆయన జననం జరిగిందని కొంతమంది చెబుతారు. ఆ సమయంలో సూర్యుడు అత్యంత ప్రకాశంవతంగా కనిపించడాని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ రాముడు పితృవాక్యపరిపాలకుడు. తన తండ్రి మాటను జవదాటేవాడే కాదు. తండ్రిచ్చిన మాటకు కట్టుబడి సతీమేతంగా, సోదరుడి లక్ష్మణుడితో కలిసి 14 ఏళ్ల వనవాసం చేశాడు. రామ బాణానికి కూడా ఎంతో విశిష్టత ఉంది. ఇది ఎంతో శక్తివంతమైంది. ఒక్కసారి సంధిస్తే అది రాజ్యంలోని మొత్తం సైన్యాన్ని సమూలంగా సంహరించగలదు.
రామరాజ్యం ఎలా ఉండేదంటే..
సీతమ్మను అపహరించిన రావణుడిని యుద్ధంలో సంహరించిన పిమ్మట తిరిగి అయోధ్యకు చేరుకొని పట్టాభిషిక్తుడవుతాడు శ్రీరాముడు. అనంతరం 11 వేల సంవత్సరాల పాటు రాజ్యాన్ని పరిపాలించడానికి నమ్ముతారు. సంపూర్ణ శాంతి, శ్రేయస్సు కోసం అయోధ్యను పరిపాలించాడు. తన రాజ్యంలో ఎవ్వరికీ కష్టాలనేవి ఉండేవి కాదట. దొంగతనం, కరవులు ఊసే లేదని చెబుతారు. తన పాలనలో ప్రతి ఒక్కరూ సుఖ, సంతోషాలతో హాయిగా జీవించేవాడట. ఆయన పాలనలో వర్షాలు సరైన సమయంలో పడేవట. నెలలో మూడు సార్లు కురవడం వల్ల పంటలు బాగా పండి రాజ్యం సశ్యామలంగా ఉండేదట.
Also Read: ఈ రాశుల వారికి కోపం ఎక్కువ.. ప్రతీకారం తీర్చుకునే వరకు వదిలిపెట్టరు
శ్రీ రామ నవమి నాడు సీతారాముల కళ్యాణం జరిగిందని, పట్టాభిషేకం కూడా ఆ రోజే జరిగిందని చెబుతారు. అందుకని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా శ్రీరామ కళ్యాణం నిర్వహిస్తారు. రామ నవమి నాడు ప్రత్యేక పూజలు చేయడం, కళ్యాణం నిర్వహించడం, రామ మంత్రాలు జపించడం వల్ల వెయ్యి రెట్ల ఫలితం కలుగుతుందని విశ్వసిస్తారు. అంతేకాకుండా రామ నామాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జపించడం వల్ల అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతుంటారు. రోగాల నుంచి విముక్తి లభిస్తుంది.